రామ్ చ‌ర‌ణ్ ప్లాన్ మాములుగా లేదుగా..ఏకంగా రజినీకాంత్ ద‌ర్శ‌కుడితోనే !

by velandi.Saikiran |

ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మిని రంగంలోకి. ప‌వ‌న్ఓజీ సినిమాతో స‌క్సెస్ అందుకున్న ఇమ్రాన్ హష్మి, ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమాలో

రామ్ చ‌ర‌ణ్ ప్లాన్ మాములుగా లేదుగా..ఏకంగా రజినీకాంత్ ద‌ర్శ‌కుడితోనే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర, RRR లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ ఏది చేసినా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. అయితే అలాంటి రామ్ చరణ్ కు మరో బంపర్ ఆఫర్ తగిలింది. ప్రస్తుతం బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్న రాంచరణ్, నెల్సన్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడట.

రామ్ చరణ్ హీరోగా నెల్సన్ అలాగే అనిరుధ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మించేందుకు సిద్ధమయ్యారట. జైలర్ 2 మూవీ ఫినిష్ అయిన తర్వాత, చ‌ర‌ణ్ - నెల్స‌న్ మూవీ లైన్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ త‌రుణంలోనే, ఈ సినిమాలో ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మిని ( Emraan Hashmi) రంగంలోకి దించుతున్నార‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ సినిమాతో స‌క్సెస్ అందుకున్న ఇమ్రాన్ హష్మి, ఇప్పుడు చ‌ర‌ణ్ సినిమాలో విల‌న్ గా చేయ‌నున్నార‌ట‌. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story