అందుకే నా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి.. నవీన్ పొలిశెట్టి హార్ట్ టచింగ్ కామెంట్స్

by Ajay Maddhiboyina |

నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒకరాజు సినిమా నుండి రాజు గారి పెళ్లి రో అనే పాటను నేడు విడుదల చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ పాటను విడుదల చేశారు.

అందుకే నా సినిమాలు ఆలస్యం అవుతున్నాయి.. నవీన్ పొలిశెట్టి హార్ట్ టచింగ్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్: నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న అనగనగా ఒకరాజు సినిమా నుండి రాజు గారి పెళ్లి రో అనే పాటను నేడు విడుదల చేశారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నవీన్ పొలిశెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. జాతిరత్నాలు లాంటి హిట్ సినిమా వచ్చినా తన సినిమాలు ఆలస్యం అవ్వడానికి గల కారణాలను నవీన్ పొలిశెట్టి వివరించాడు. హీరో అవ్వకముందు ఫ్రెండ్ సినిమాకు వెళదామని అడిగితే రూ.400 ఖర్చు అవుతాయని భయపడేవాడినని అన్నాడు.

డబ్బులు లేక వాళ్లకు నో చెప్పడానికి ఇబ్బంది పడేవాడినని చెప్పాడు. ఒక కుటుంబం ఖష్టపడి సంపాదించి సినిమా చూసేందుకు రూ.2వేలు ఖర్చు చేస్తుందన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించిన సాల‌రీ నుండి కొంత ప‌ర్సంటేజ్ డ‌బ్బులు పెడ‌తార‌ని అన్నారు. అలాంట‌ప్పుడు ఆ డ‌బ్బుల‌కు న్యాయం చేయాల‌నే తాను ఆల‌స్యంగా , చాలా జాగ్ర‌త్త‌గా సినిమాలు చేస్తున్నాన‌ని చెప్పారు. డ‌బుల్ వినోదాన్ని పంచ‌డానికే అన‌గ‌న‌గా ఒక‌రాజు సినిమాతో సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాన‌ని అన్నారు. ప్రేక్ష‌కుల డ‌బ్బుల గురించి ఆలోచిస్తూ న‌వీన్ చేసిన వ్యాఖ్య‌లపై సినీ అభిమానులు, నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Next Story