- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Naveen Chandra: ఈసారి జాతర ఊపు మీద ఉంది.. మాస్ జాతర అప్డేట్ ఇచ్చిన నవీన్ చంద్ర
భాను భోగవరకు డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘మాస్ జాతర’.

దిశ, సినిమా: భాను భోగవరకు డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్‌టైనింగ్ మూవీ ‘మాస్ జాతర’. మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోహీరోయిన్‌గా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టు 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో షూటింగ్ పనుల్లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా జాతర సాంగ్ షూట్ జరగుతున్నట్లు శ్రీలీల డ్యాన్స్ సీన్స్ కూడా కొన్ని నెట్టింట వైరల్‌గా మారి సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు నవీన్ చంద్ర ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.
ఈ మేరకు ‘మాస్ జాతర డబ్బింగ్ ప్రారంభమైంది. ఇది చాలా లౌడ్‌గా ఉండబోతుంది. రవితేజ, శ్రీలీల జంటగా.. భాను భోగవరకు డైరెక్షన్ యెక్క ఈ మాస్ రైడ్‌లో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈసారి జాతర... జోరుగా సాగుతోంది.. ఆగస్టు 27న థియేటర్స్‌లో కలుసుకుందాం’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను పంచుకున్నాడు నవీన్ చంద్ర. కాగా.. ‘మాస్ జాతర’ చిత్రంలో నవీన్ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లింక్






