- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొట్టపగిలి నవ్వేలా.. నారీ నారీ నడుమ మురారి
చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా ఉండబోతుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవ్వులు, భావోద్వేగాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామా కలయికలో పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా ఉండబోతుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14నసాయంత్రి 5:49 గంటలకు ఫస్ట్ షోతో మూవీ రిలీజ్ కాబోతుండగా.. మేకర్స్ తాజాగా సినిమా టీజర్ లాంచ్ చేశారు. ఇందులో కథ శర్వా పాత్ర చుట్టూ తిరుగుతుంది. అతను ప్రేమలో పడతాడు.. తన గర్ల్ ఫ్రెండ్ తండ్రిని వారి వివాహానికి ఆమోదించమని ఒప్పిస్తాడు. అంతా సజావుగా జరుగతున్న సమయంలో అతని మాజీ ప్రియురాలు అకస్మాత్తుగా ఆఫీస్‌లోకి రావడంతో ఊహించని మలుపు తిరుగుతుంది. తరువాత జరిగే హ్యుమరస్ సంఘటనలు.. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న శర్వా పాత్ర.. వినోదాత్మక కథనం ఆకట్టుకున్నాయి. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన శర్వా.. ‘మనం అనుకున్నది సాధించే శక్తి మన అందరిలో ఉంటుంది. ఎవరి ఒపీనియన్స్‌పై ఆధారపడకండి. ఎందుకంటే మన లైఫ్‌ను మనమే బ్రతకాలి. కష్టపడి చదవండి. భయపడకండి. అనుకున్నది సాధించండి. ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే విషయం చెప్తాను. సినిమా పొట్టపగిలి నవ్వేలా వుంటుంది. జనవరి 14న రిలీజ్ అవుతుంది. 5:49 ఫస్ట్ షో. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపాడు.






