- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Rohit: ఆ జోనర్ చిత్రాలు అంతగా నచ్చవు.. నారా రోహిత్ కామెంట్స్ వైరల్
నారా రోహిత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భైరవం’.

దిశ, సినిమా: నారా రోహిత్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భైరవం’. రోహిత్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య ‘భైరవం’ మే 30 వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజైంది. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా విజయం వైపు అడుగులు వేస్తుండటంతో.. సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్ హారర్ జోనర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మీరు పర్సనల్‌గా ఏ జోనర్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడతారు అని యాంకర్ ప్రశ్నించగా.. దీనిపై స్పందించిన నారా రోహిత్.. ‘ఈ జోనర్ అని ఏం ఉండదు. అన్ని జోనర్స్‌లో సినిమాలు చూస్తాను. అయితే... హారర్ మూవీస్‌కు అంత బిగ్ ఫ్యాన్ కాదు. ఇంకా ఏ జోనర్ అయినా కూడా నేను ఎంజాయ్ చేస్తాను. డ్రామా మూవీస్, యాక్షన్ ఫిలిమ్స్, స్పోర్ట్స్ డ్రామా ఏదైనా ఎంజాయ్ చేస్తాను. హారర్ కామెడీ ఎంజాయ్ చేస్తాను. పూర్తిగా హారర్ మూవీస్ మాత్రం చూడను’ అని తెలిపారు. అందుకే హారర్ జోనర్ అసలు టచ్ చేయలేదు అని యాంకర్ అనగా.. మధ్యలో ఒకటి అనుకున్నాం కానీ, ఇంకా అటు వెళ్లాలి అనిపించలేదు’ అని తెలిపారు.






