సిరితో ఏడడుగులు వేసేది అప్పుడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్

by I. Sairam |

చాలా రోజుల తర్వాత హీరో నారా రోహిత్(Nara Rohit) విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో వచ్చిన ‘భైరవం’(Bairavam) మూవీతో మన ముందుకు వచ్చాడు.

సిరితో ఏడడుగులు వేసేది అప్పుడే అంటూ గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్.. ఫుల్ ఖుషిలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా రోజుల తర్వాత హీరో నారా రోహిత్(Nara Rohit) విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో వచ్చిన ‘భైరవం’(Bairavam) మూవీతో మన ముందుకు వచ్చాడు. అతనితో పాటు బెల్లం కొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj) కూడా హీరోలుగా నటించారు. ఇక ఆనంది(Anandi), అదితీ శంకర్(Aditi Shankar), దివ్యా పిళ్లై(Divya Pillai) హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. నారా రోహిత్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక అతనికి మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఈ సినిమా కోసం అతను గట్టిగానే కష్టపడ్డాడు . ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటూ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన పెళ్లి గురించి కూడా ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది అక్టోబర్‌లో సిరిని పెళ్లి చేసుకోబోతున్నాను. హిందూ సంప్రదాయం ప్రకారం.. అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది’ అని నారా వారి హీరో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా ‘ప్రతినిధి-2’(Prathinidhi-2) సినిమాలో హీరో నారా రోహిత్‌ సరసన శిరీష(Sirisha) నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇక ఇరు కుంటుంబాలను ఒప్పించి గతేడాది అక్టోబర్‌లోనే నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే ఇప్పటికే నారా రోహిత్‌-సిరిల పెళ్లి జరగాల్సి ఉండగా.. నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో కన్నుమూశారు. దీంతో తమ పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నాడు.

Next Story