‘బ్యాండ్ మేళం’ దర్శకుడితో నాని సినిమా.. అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ

by Mallepaka Hamsa |

మా తదుపరి ప్రొడక్షన్ నంబర్ గురించి ప్రస్తుతం నెట్‌లో ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి, నిరాధారమైనవి.

‘బ్యాండ్ మేళం’ దర్శకుడితో నాని సినిమా.. అధికారిక ప్రకటనతో క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ఓ వైపు ‘ది ప్యారడైజ్’ వంటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో పాల్గొంటూనే.. నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఇప్పటికే ఆయన నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను నాని ‘బ్యాండ్ మేళం’ చిత్రాన్ని తెరకెక్కించిన సతీష్ జవ్వాజి మరో కథను సిద్ధంగా చేయగా.. నాని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సతీష్ చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిని పనులు కూడా ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తాజాగా, ఈ పుకార్లపై వాల్ పోస్టర్ సినిమాస్ నిర్మాణ సంస్థ గట్టిగా స్పందించింది. తమ తదుపరి సినిమా గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. "మా తదుపరి ప్రొడక్షన్ నంబర్ గురించి ప్రస్తుతం నెట్‌లో ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమైనవి, నిరాధారమైనవి. మా సినిమాలకు సంబంధించిన ఎలాంటి అధికారిక అప్‌డేట్‌లు అయినా సరే.. కేవలం మా అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మాత్రమే తెలియజేస్తాము. కాబట్టి ఎవరూ కూడా ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అందరినీ కోరుతున్నాము" అని స్పష్టం చేశారు. వాల్ పోస్టర్ సినిమాస్ టీమ్ ఇచ్చిన ఈ క్లారిటీతో నాని-సతీష్ జవ్వాజి కాంబినేషన్ సినిమాపై వస్తున్న పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్లయింది.

Next Story