నాని బర్త్‌డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్..?

by I. Sairam |

నాచురల్ స్టార్ నాని(Nani) ‘అష్టాచమ్మ’(Asta chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించాడు.

నాని బర్త్‌డే స్పెషల్.. ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్..?
X

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని(Nani) ‘అష్టాచమ్మ’(Asta chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. మెయిన్‌గా నాచురల్‌గా యాక్టింగ్ చేస్తూ ఆడియన్స్‌లో పక్కింటి అబ్బాయి అనే ప్లేస్ సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇక నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో భాగంగా ఆయన ప్రజెంట్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise).

శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు కీరోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా ఈ మూవీ కోసం అభిమానులు ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. అయితే నాని బర్త్‌డే (ఫిబ్రవరి 24న) స్పెషల్‌గా ది ప్యారడైజ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఆ దిశగా సాంగ్ వర్క్ జరుగుతుందట. కాగా ఈ చిత్రానికి అనిరుధ్(Anirudh) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా తర్వాత నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్‌(Sujith)తో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్‌ అందుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Next Story