- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సనాతన ధర్మాన్ని కాపాడే సైనికులు అఘోరాలు: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
సనాతన ధర్మాన్ని కాపాడే సైనికులు అఘోరాలు: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న అఖండ-2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. నాకు రాజకీయ గురువు, సినిమా గురువు రెండూ మా నాన్న నందమూరి తారక రామారావే అని అన్నారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. కొన్ని సినిమాలు ఆనంద పరుస్తాయి.. కొన్ని సినిమాలు ఉత్తేజపరుస్తాయి.. కొన్ని సినిమాలు ఆలోచించేలా చేస్తాయి.. కానీ ఇది మన సనాతన ధర్మాన్ని చూపించే సినిమా అని అన్నారు. తప్పును నిలదీయడమే సనాతన ధర్మం అని చెప్పారు. సరిహద్దుల్లో దేశాన్ని కాపాడే వాళ్లు సైనికులు అయితే.. ధర్మాన్ని కాపాడే సైనికులు అఘోరాలు అని అన్నారు. నా సినిమాలు అన్నీ ఉగాది పచ్చడి లాంటివని అన్నారు. అందులో అన్నీ ఉంటాయని చెప్పారు. ఇప్పటివరకు వరుసగా నాలుగు హిట్స్ కొట్టాను.. ఇది మరో హిట్ కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్, లుక్స్ అన్నీ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో బాలయ్య గంభీర డైలాగులు, బోయపాటి మాస్ బిల్డప్, ఆది పినిశెట్టి విలన్ షేడ్స్ అన్నీ కలిసి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






