- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లెనిన్’లో నాగార్జున మార్పులు?
‘లెనిన్’ సినిమాలో నాగార్జున మార్పులు చేయాలని కోరినట్లు టాక్ నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్, పెద్ద హిట్ అందుకున్న దాఖలాలు లేవు. మంచి హిట్టు కోసం చాలా కష్టపడుతున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలోనే లెనిన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
లెనిన్ సినిమాలో వేలు పెడుతోన్న నాగ్?
అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్, షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ తరుణంలో ఈ సినిమా ఫైనల్ కట్ చూశాడట అక్కినేని నాగార్జున. అయితే ఈ ఫైనల్ కట్ చూసిన నాగార్జున, కొన్ని మార్పులను సూచించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీంతో సినిమాను ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన యెట్టా యెట్టా సాంగ్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా లెనిన్ సినిమా జూన్ 26వ తేదీన రిలీజ్ కానుంది.






