విజయ్ దేవరకొండనే నాకు పవన్ కళ్యాణ్ : నాగవంశీ హాట్ కామెంట్స్

by Muthe.Rajitha |

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'కింగ్ డమ్'(Kingdom) సినిమా నేడు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండనే నాకు పవన్ కళ్యాణ్ : నాగవంశీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'కింగ్ డమ్'(Kingdom) సినిమా నేడు విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్ ను నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ మీట్ లో నిర్మాత నాగవంశీ(Producer Nagavamshi) పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'కింగ్ డమ్' మంచి టాక్ సొంతం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ కి ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక కింగ్ డమ్ సీక్వెల్ లో నటిస్తారని తెలిపారు. ఈ సీక్వెల్ లో 'సేతు' పాత్రలో ఓ పెద్ద హీరో నటిస్తారని అన్నారు. అయితే త్వరలోనే ఏపీలో కూడా సక్సెస్ మీట్ నిర్వహిస్తామని వంశీ తెలపగా.. కోస్తాలో సక్సెస్ మీట్ కు పవన్ కళ్యాణ్ ను పిలుస్తారా అని రిపోర్టర్స్ ఆయనను ప్రశ్నించారు.

అందుకు ఆయన నాకు విజయ్ దేవరకొండనే పవన్ కళ్యాణ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు మొదటి రోజే బ్రేక్ ఈవెన్ 50 శాతం రికవరీ అయిందని, దాదాపు రూ.40 కోట్లు ఈ ఒక్కరోజే వచ్చాయని ప్రకటించారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ హిట్ తో నా హృదయం నిండిపోయిందని అన్నారు. అభిమానులు, శ్రీవెంటేశ్వరస్వామి నా వెంట ఎప్పుడూ ఉంటారని, మీ ఆశీస్సుల వల్లె నేను ఇంత పెద్ద విజయం సాధించానని పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ నటించింది.

Next Story