- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నితిన్‌ను ఖుషి చేసిన నాగ వంశీ.. రంగంలోకి ఇద్దరు దర్శకులు
సోము, నరి అనే ఇద్దరు కొత్త దర్శకులు నితిన్, సితార బ్యానర్లో చేయబోయే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: నితిన్ పుట్టినరోజు సందర్భంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఆయనతో సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనేది మాత్రం వారు వెల్లడించలేదు. కానీ ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు నితిన్‌తో చేయబోయే సినిమాకు ఒకరు కాదు, ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కూడా కొత్త దర్శకులేనని సమాచారం.
సోము, నరి అనే ఇద్దరు కొత్త దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మే 4వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్లు, మే 6వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. కేవలం 55 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించబోతున్నట్లు సమాచారం. ఇక నితిన్‌తో నాగ వంశీ ఏ జానర్‌లో చిత్రాన్ని నిర్మిస్తాడు అన్న విషయంపై ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ వరుస ప్లాప్‌లలో ఉన్నాడు. మరి ఈ నటుడికి నిర్మాత నాగ వంశీ ఏ స్థాయి విజయాన్ని అందిస్తాడో చూడాలి.






