- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పాన్ ఇండియా సినిమాపైనే ఇస్మార్ట్ బ్యూటీ ఆశలు.. ఈసారైనా కలిసొచ్చేనా?
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకుంది నభా నటేష్.

దిశ, సినిమా: ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్‌ను తెచ్చుకుంది నభా నటేష్ (Nabha Natesh). దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టడంతో.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక కెరీర్ ఫామ్‌లో ఉంది అనుకున్నటైమ్‌లో యాక్సిడెంట్ కారణంగా.. కొన్నాళ్లు మూవీస్‌కు దూరం అయింది. తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డార్లింగ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడు నిఖిల్ నటిస్తున్న మోస్ట్ వవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’(Swayambhu)లో ఫీమేల్ లీడ్‌లో అలరించనుంది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఠాగూర్ మధు సమర్పణలో పిక్వెల్ స్టూడియోస్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా హిట్ అవ్వడం ఖాయం అని భావిస్తుండగా.. రీ ఎంట్రీలో నభాకు ఈ సినిమా మంచి ప్లెస్ అవుతోందని భావిస్తు్న్నారు ఫ్యాన్స్. కానీ, గతకొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఏఒక్క అప్డేట్ రాకపోవడంతో.. ప్రేక్షకుల్లో కొంచెం నిరాశ కనిపిస్తుంది. అయితే.. నభా నటేష్ మాత్రం నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ ట్రీట్ ఇస్తూను ఉంటుంది. ఈక్రమంలోనే తాజాగా షేర్ చేసిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లింక్






