‘ద్రౌపది 2’ నుంచి మెలోడి సాంగ్ ‘నా నెలరాజే’

by Sujitha Rachapalli |

రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్.జి దర్శకులు. కాగా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు

‘ద్రౌపది 2’ నుంచి మెలోడి సాంగ్ ‘నా నెలరాజే’
X

దిశ, సినిమా : రిచర్డ్ రిషి హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. నేతాజీ ప్రొడక్షన్స్, జీఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై సోల చక్రవర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహన్.జి దర్శకులు. కాగా మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ద్రౌప‌ది పాత్ర‌లోని ర‌క్ష‌ణ ఇందుచూడన్ ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రీసెంట్‌గానే విడుద‌ల చేయ‌గా సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘నెల‌రాజె..’ పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. కాబోయే వరుడిని మనసులో ఊహించకుంటే పాడే ఈ పాటకు జిబ్రాన్ సంగీతం అందించగా.. సామ్రాట్ లిరిక్స్ అందించారు. పద్మలత ఆలపించారు. నట్టి నటరాజ్, వేల రామమూర్తి, చిరాగ్ జాని, దినేష్ లాంబా, గణేష్ గౌరంగ్, వై గీ మహేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.

Next Story