నా అన్వేష్ మరో సంచలన వీడియో.. పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి లాగి మరీ!

by velandi.Saikiran |

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లోని కోర్టు సీన్ షేర్ చేశాడు నా అన్వేష్. ఇందులో మహిళల బట్టల పై పవన్ అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు.

నా అన్వేష్ మరో సంచలన వీడియో.. పవన్ కళ్యాణ్ ను మధ్యలోకి లాగి మరీ!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు నా అన్వేష్ గురించి చర్చ జరుగుతోంది. న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా దొరికిపోయాడు నా అన్వేష్. హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడి అందరికీ కోపం తెప్పించాడు. దీంతో నా అన్వేష్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో కేసులు నమోదవుతున్నాయి. అతనిపై దేశద్రోహి కేసు కూడా నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బిజెపి నేతలు.

అయితే ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలోని కోర్టు సీన్ షేర్ చేశాడు యూట్యూబర్ నా అన్వేష్. ఇందులో మహిళల బట్టల పై పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్పీచ్ ఇస్తాడు. మహిళలకు నచ్చిన బట్టలు వేసుకోనివ్వాలనే అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఈ సీన్ లో ఉంటాయి. అయితే మహిళకు నచ్చిన బట్టలు వేసుకోమని పవన్ కళ్యాణే చెబుతున్నాడు.. నేను చెబితే తప్ప అన్న రేంజ్ లో ఆ వీడియోను షేర్ చేశాడు అన్వేష్. దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు చేసిన పనికి మా హీరోను ఎందుకు మధ్యలో లాగుతున్నావని అన్వేష్‌కు కౌంటర్ ఇస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. క్లిక్

Next Story