Shreya Ghoshal: నా X అకౌంట్ హ్యాక్ అయ్యింది.. ఆ లింక్‌లు క్లిక్ చేయోద్దు.. ప్రముఖ సింగర్ పోస్ట్

by Chukka Sudharani |

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల (Celebrities) సోషల్ మీడియా అకౌంట్స్‌ (Social media accounts)ను ఫ్లాట్‌ఫామ్స్‌గా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు

Shreya Ghoshal: నా X అకౌంట్ హ్యాక్ అయ్యింది.. ఆ లింక్‌లు క్లిక్ చేయోద్దు.. ప్రముఖ సింగర్ పోస్ట్
X

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల (Celebrities) సోషల్ మీడియా అకౌంట్స్‌ (Social media accounts)ను ఫ్లాట్‌ఫామ్స్‌గా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals).. వాటిని హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ సైబర్ నేరగాళ్ల ఎంతోమంది సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్‌ను హ్యాక్ చెయ్యగా.. తాజాగా ఇండియన్ స్టార్ ప్లే బ్యాక్ సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ట్విట్టర్‌ (Twitter)ను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ సింగర్ శ్రేయా ఘోషల్ ఓ పోస్ట్ పెట్టింది.

‘హలో.. ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్.. ఫిబ్రవరి 13 నుండి నా Twitter / X ఖాతా హ్యాక్ చేయబడింది. X టీమ్‌ను సంప్రదించడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను. కానీ కొన్ని ఆటో జనరేట్ రెస్పాన్స్‌లకు మించి ఏ స్పందన లేదు. హ్యాకింగ్ కారణంగా నేను ట్విట్టర్ లాగిన్ చేయలేనందున నా ఖాతాను కూడా తొలగించలేకపోతున్నాను. దయచేసి ఆ అకౌంట్ నుంచి ఏదైనా లింక్‌లు వస్తే క్లిక్ చేయవద్దు.. అలాగే ఆ ఖాతా నుండి వచ్చిన ఎలాంటి సందేశాన్ని నమ్మవద్దు. అవన్నీ స్పామ్‌లు అండ్ ఫిషింగ్ లింక్‌లు. ఖాతా పునరుద్ధరించబడి సురక్షితంగా ఉంటే నేను వ్యక్తిగతంగా వీడియో ద్వారా అప్‌డేట్ చేస్తాను’ అంటూ తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా తెలియబరిచింది సింగర్ శ్రేయా ఘోషల్.

Next Story