నా కర్లీ హెయిర్ ఆఫర్లు రాకుండా చేసింది.. హీరోయిన్

by Sujitha Rachapalli |

హీరోయిన్ తాప్సీ అంటే కర్లీ హెయిర్ గుర్తొస్తుంటుంది. అదే ఆమెకు అందం అనిపిస్తుంది. కానీ ఈ కర్లీ హెయిర్ కారణంగా చాలా ఆఫర్లు కోల్పోయినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బ్యూటీ. ఆడిషన్స్‌లో నిర్మాతలు నా హెయిర్ చూసి హెజిటేట్ అయ్యేవారని.. ట్రెడిషనల్ హీరోయిన్లకు ఉండాల్సిన

నా కర్లీ హెయిర్ ఆఫర్లు రాకుండా చేసింది.. హీరోయిన్
X

దిశ, సినిమా : హీరోయిన్ తాప్సీ అంటే కర్లీ హెయిర్ గుర్తొస్తుంటుంది. అదే ఆమెకు అందం అనిపిస్తుంది. కానీ ఈ కర్లీ హెయిర్ కారణంగా చాలా ఆఫర్లు కోల్పోయినట్లు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది బ్యూటీ. ఆడిషన్స్‌లో నిర్మాతలు నా హెయిర్ చూసి హెజిటేట్ అయ్యేవారని.. ట్రెడిషనల్ హీరోయిన్లకు ఉండాల్సిన లుక్ తనకు లేదని మొహం మీదనే చెప్పేవారని తెలిపింది. ఈ విషయం తనను చాలా డిజప్పాయింట్ చేసిందని.. ఈవెన్ ఆఫర్లు వచ్చాక కూడా హెయిర్ స్ట్రెయిట్ చేయాలని మేకర్స్ నుంచి ప్రెజర్ ఉండేదని చెప్పింది. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ తన హెయిర్‌ను లైక్ చేశాడని... విజయ్ దేవరకొండ కూడా కర్లీ హెయిర్ అలాగే ఉంచాలని ఎంకరేజ్ చేశాడని తెలిపింది బ్యూటీ. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లో చాలా మంది తన నేచురల్ హెయిర్‌ను అప్రిషియేట్ చేస్తున్నారని చెప్పింది. ఇక సౌత్‌తోపాటు హిందీ ఇండస్ట్రీలో సత్తా చాటిన తాప్సీ.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రజెంట్ సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్స్ ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.

Next Story