హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మ్యూజిక్ డైరెక్టర్.. అతిథిలా వచ్చిన హీరోయిన్..

by Chukka Sudharani |

రీసెంట్‌గా థియేటర్‌లోకి వచ్చిన ‘బైసన్’(Bison).. ప్రజెంట్ పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తుంది.

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మ్యూజిక్ డైరెక్టర్.. అతిథిలా వచ్చిన హీరోయిన్..
X

దిశ, సినిమా: రీసెంట్‌గా థియేటర్‌లోకి వచ్చిన ‘బైసన్’(Bison).. ప్రజెంట్ పాజిటివ్ టాక్‌తో ముందుకు వెళ్తుంది. ధ్రువ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. దీనికి నివాస్ కె ప్రసన్న (Music director Nivas K. Prasanna) సంగీతం అందించగా.. సాంగ్స్ సూపర్ హిట్ అందుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం మేరకు బైసన్ సంగీత దర్శకుడు ఇప్పుడు నటుడుగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. ‘జాడ’, ‘పరై’ లాంటి చిత్రాలతో ఫేమ్ సొంతం చేసుకున్న కుమారన్ (Director Kumaran) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇందులో హీరోయిన్‌గా అదితి శంకర్‌(Aditi Shankar)ను తీసుకున్నారట. ఇప్పటికే ఈ కాంబో ఫిక్స్ అయినట్లు కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వస్తుండగా.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Next Story