Murali Mohan: ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి.. వైరల్‌గా సీనియర్ హీరో మురళీ మోహన్

by Chukka Sudharani |

సీనియర్ నటీనటులు మురళీ మోహన్ (Murali Mohan), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’.

Murali Mohan: ఇలాంటి సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాలి.. వైరల్‌గా సీనియర్ హీరో మురళీ మోహన్
X

దిశ, సినిమా: సీనియర్ నటీనటులు మురళీ మోహన్ (Murali Mohan), ఆమని (Amani) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. టి.వి. రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకోగా.. తాజాగా మురళీ మోహన్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఈ క్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో.. మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘నా పుట్టిన రోజుని ఎప్పుడూ కూడా దివ్యాంగులు, వృద్దాశ్రమాలు, అనాథాశ్రమాల్లో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈ రోజు కూడా అంధుల ఆశ్రమానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఓ అరగంట వచ్చి వెళ్లండని ‘డొక్కా సీతమ్మ’ టీం పిలిచింది. అందుకే ఇలా వచ్చాను. చిన్న నిర్మాతలే అయినా నా బర్త్ డేను ఇలా సెలెబ్రేట్ చేస్తున్నందుకు థాంక్స్. డొక్కా సీతమ్మ గారి మీద సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కాటన్ దొర గారు సైతం డొక్కా సీతమ్మ గారిని పొగిడారు. సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే.. 'నేను అక్కడికి వస్తే ఇక్కడ వారి ఆకలి ఎవరు తీరుస్తారు?' అని డొక్కా సీతమ్మ గారు నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు అంతా కమర్షియల్‌గా మారింది. అలాంటి టైంలో రాంబాబు, రవి నారాయణ ముందుకు వచ్చారు. ఇలాంటి చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాలి’ అని అన్నారు.

Next Story