పచ్చని ప్రకృతి నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న బ్యూటిపుల్ నటి.. హృదయానికి హత్తుకునే పిక్స్ వైరల్

by Kodari Anjali |   (  Updated:2025-06-02 16:19:08  IST  )

సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. హాయ్ నాన్న సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది.

పచ్చని ప్రకృతి నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న బ్యూటిపుల్ నటి.. హృదయానికి హత్తుకునే పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. హాయ్ నాన్న సినిమాతో మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని అండ్ మృణాల్ ఠాకూర్‌ జోడిగా తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. కళ్లలో నీళ్లు తెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు. మృణాల్ ఠాకూర్‌ హైలెట్‌గా నిలిచిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను నాని అండ్ మృణాల్ ఠాకూర్ ఇద్దరూ కలిసి ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ తండ్రి, కూతురుల మధ్య బంధం.. ప్రేమ గురించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో జనాలకు బాగా నచ్చింది. ఈ సినిమా తర్వాత మృణాల్‌కు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి.

ప్రస్తుతం కూడా పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన ఏ సినిమా అయిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందేనని సోషల్ మీడియాలో అభిమానులు తెగ హంగామా చేస్తుంటారు. అలాగే ఈ హీరోయిన్ తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో నెటిజన్లను కవ్విస్తుంటుంది. తాజాగా మృణాల్ నెట్టింట ఓ పోస్ట పెట్టింది. పచ్చని ప్రకృతి నడుమ చిరునవ్వులు చిందిస్తోన్న బ్యూటిపుల్ పిక్స్ పంచుకుంది. ఈ ఫొటోలు వీక్షించిన ఫ్యాన్స్ అద్భుతమైన కామెంట్లతో ముంచెత్తుతున్నారు. హృదయానికి హత్తుకునే పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story