- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భాష కాదు భావోద్వేగాలు ముఖ్యం అంటున్న మృణాల్ ఠాకూర్.. త్వరలోనే ఆ భాషలో సినిమా చేస్తా
మంచి కథలు వస్తే ఏ భాషలో అయినా సినిమాలు చేస్తాను అంటుంది మృణాల్ ఠాకూర్

దిశ, సినిమా: కెరీర్‌ను అలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకోవాలి అని నేనెప్పుడూ అనుకోలేదు అంటుంది మృణాల్ ఠాకూర్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ కెరీర్ స్టార్టింగ్ ఎదుర్కొన్న స్ట్రగుల్స్ గురించి చెప్పుకొచ్చింది. ‘ఇండస్ట్రీలోకి బయట వ్యక్తిగా అడుగుపెట్టడం, అవకాశాలు అందుకోవడం సవాలుతో కూడుకున్న పని. బాలీవుడ్‌లో నా తొలినాళ్లు చాలా కష్టంగా గడిచాయి. కాలక్రమేణా ఆ అడ్డంకులు దాటుకొని నటిగా ఎదగడానికి కష్టపడుతున్నా. అలాగని నేను కెరీర్ స్టార్టింగ్‌లో ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలను ముందుగానే వెతకడం నేర్చుకున్నా. ఉత్తరాది, దక్షిణ చిత్రాల మధ్య కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే ముందుకు వెళ్లాలనుకుంటున్నా. తమిళ పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టాలనే ఆలోచన ఉంది. చాలా కథలు వింటున్నా. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా. అయినా నాకు భాషతో అవసరం లేదు. భావోద్వేగాలే ముఖ్యం. వివిధ భాషల్లో కూడా మంచి కథలు దొరకాలని, సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.






