- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీ అడుగు తాకిన ఈ నేల.. వ్యవసాయం, టెక్నాలజీ కలిస్తే..
త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు.

దిశ, సినిమా : త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన మూవీని.. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించారు. అరుణ్ చిలువేరు, ప్రకాష్ చెరుకూరి సంగీతం సమకూర్చారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా యాంథమ్ సాంగ్ ‘నీ అడుగు తాకి ఈ నేల’ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో కృష్ణుడు వ్యవసాయం చేస్తున్నట్లుగా చూపించిన విధానం మరింత ఆసక్తిని రేకిస్తుంది. బాబా సెహగల్ వాయిస్ యూత్‌ను వెంటనే అట్రాక్ట్ చేసే ఎనర్జీతో పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చింది. అర్వింద్ మండెం రాసిన లిరిక్స్ పవర్ ఫుల్‌గా వున్నాయి. వ్యవసాయం ప్రాముఖ్యతను మట్టి వాసనతో పాటు ఆధునిక టెక్నాలజీ టచ్ కలిపి పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయడంలో ఆయన లిరిక్స్ కీలక పాత్ర పోషించాయి. ఈ చిత్రానికి రవికుమార్ డీవోపీ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కాగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.






