- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా ఫ్రెండ్ శర్వానంద్ హిట్ కొట్టాడు.. ఎంపీ కేశినేని కీలక వ్యాఖ్యలు
శర్వానంద్ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి సినిమా సపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: శర్వానంద్ హీరోగా నటించిన నారి నారి నడుమ మురారి సినిమా సపర్ హిట్ టాక్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు హీరో శర్వానంద్, ప్రొడ్యూసర్ అనిల్ సుంకర స్నేహితులు అని చెప్పారు. శర్వానంద్ తనకు ఎప్పటి నుండో తెలుసని అన్నారు. శర్వానంద్ తో తాను సినిమా చేయాలని అనుకున్నానని రెండేళ్లు సినిమా కోసం కలిసి ప్రయాణం చేశామని చెప్పారు.
కానీ వ్యాపారాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అన్నారు. అనిల్ సుంకర తన చిన్ననాటి స్నేహితుడు అని అతడికి సినిమాలు అంటే పిచ్చి అని వ్యాఖ్యానించారు. ఎంతో ప్యాషన్ తో అనిల్ సినిమాలు నిర్మిస్తుంటాడని అన్నారు. తాను శర్వానంద్ తో కలిసి సినిమా చేయకపోయినా అనిల్ చేసి హిట్ కొట్టాడని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన ఇద్దరు స్నేహితులు కలిసి బ్లాక్ బస్టర్ కొట్టారని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో నటించిన శ్రీవిష్ణు సినిమాలు కూడా బాగుంటాయని ఆయన స్మూత్ గా డైలాగులు చెప్పడం బాగుంటుందని వ్యాఖ్యానించారు.






