- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్ ప్లాన్‌లో రామ్.. లోకేష్ అసిస్టెంట్‌తో మూవీ
రామ్ నెక్స్ట్ మూవీపై సూపర్ అప్డేట్... లోకేష్ కనకరాజ్ అసోసియేట్‌తో జత కట్టనున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇటీవల ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై చాలా రోజులు గడిచినప్పటికీ, ఆయన తదుపరి చిత్రంపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. దీంతో రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా రామ్ ఓ హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ వద్ద అసోసియేట్‌గా దాదాపు మూడు నుంచి నాలుగు చిత్రాలకు పనిచేసిన లోగి విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ తన తదుపరి చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని, దర్శకుడు విఘ్నేష్ వినిపించిన కథ రామ్‌కు నచ్చడంతో ఆయన ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని, మిగతా నటీనటులు మరియు టెక్నీషియన్ల వివరాలు కూడా త్వరలో వెల్లడయ్యే అవకాశముందని తెలుస్తుంది.






