- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హిట్-4’ సినిమాపై హింట్ ఇచ్చేసిన మూవీ మేకర్స్.. హీరోను రివీల్ చేసి హైప్ పెంచేశారుగా!
టాలీవుడ్ నేచరల్ స్టార్ నాని(nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(hit-3). ఈ సినిమా ఘన విజయం సాధించిన ‘హిట్’కు సీక్వెల్‌గా వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నేచరల్ స్టార్ నాని(nani) నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్-3’(hit-3). ఈ సినిమా ఘన విజయం సాధించిన ‘హిట్’కు సీక్వెల్‌గా వచ్చింది. అయితే శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) హీరోయిన్‌గా నటించింది. అలాగే ఇందులో ఆదిల్ పాలా, రావు రమేష్, మాగంటి శ్రీనాథ్, కోమలి ప్రసాద్ కీలక పాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అయితే ‘హిట్-3’ నేడు మే1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. ‘హిట్-4’ కన్ఫర్మ్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
దానికి కారణం హిట్-3లో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి(Karthi) గెస్ట్ రోల్‌లో కనిపించడంతో.. నెక్ట్స్ సీక్వెల్‌లో ఆయన హీరోగా నటిస్తున్నాడని అంటున్నారు. క్లైమాక్స్‌లో కార్తి రత్నవేల్ పాండియన్ అనే పోలీస్ అధికారికగా స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాకుండా ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అంటూ శ్రీ గురజాడ అప్పారావు చెప్పి కవిత్వాన్ని తన స్టైల్లో చెప్పి మెప్పించారు. దీంతో హిట్-4లో హీరో ఫిక్స్ అయినట్లు మేకర్స్ ఈ విధంగా హింట్ ఇచ్చారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ కార్తికి సంబంధించిన పోస్టులు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. ఏకంగా కోలీవుడ్ హీరోనే దింపి అంచనాలను పెంచేశారు. డైరెక్టర్ ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు.






