- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother's Day Special: నా జీవితంలో గొప్ప ఆనందాలు అమ్మ కావడం వల్లే వచ్చాయి.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) మనందరికీ సుపరిచితమే. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది.

దిశ, వెబ్‌డెస్క్: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి(Manchu Lakshmi) మనందరికీ సుపరిచితమే. నటిగా, సింగర్‌గా, నిర్మాతగా, యాంకర్‌గా మెప్పించింది. అలా మల్టీ టాలెంటెడ్ పర్సన్‌గా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ కనిపిస్తూ మెప్పిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మి నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ వరుస పోస్టులతో ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా మదర్స్ స్పెషల్‌గా ఓ వీడియో షేర్ చేసింది. అందులో తన కూతురుతో పాటు వాళ్ల అమ్మగారితో ఉన్న కొన్ని హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసింది. ఇక ఈ వీడియోకు.. ‘నా జీవితంలో గొప్ప ఆనందాలు అమ్మ కావడం వల్లే వచ్చాయి’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు హ్యాపీ మదర్స్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు.






