- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mother's Day Special: మదర్స్ డే స్పెషల్.. ఇరవై మూడు సినిమా నుంచి ‘జో లాలీ జోజో’ సాంగ్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న క్యూట్ పోస్టర్
తేజ్, తన్మయి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘23’ (ఇరవై మూడు) (Twenty Three).

దిశ, సినిమా: తేజ్, తన్మయి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘23’ (ఇరవై మూడు) (Twenty Three). ఈ సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా అనే కథతో రూపొందుతోన్న ఈ మూవీకి రాజ్ ఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఝాన్సీ, పవన్ రమేశ్ కీలక పాత్రలో నటిస్తు్న్నారు. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ (Trailer) ఎంతో మందిని ఆకట్టుకోగా.. మూవీపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. చుండూరు మారణ హోమం, జూబ్లీహిల్స్ బాంబు పేలుడు నేపథ్యంలో.. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే నేడు మదర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ‘జో లాలీ జో.. జో..’ అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘నల్లాటి వెలుగల్లే.. నడిరాతిరి నవ్వల్లే.. సాగేటీ వరదల్లో.. బడి దారుల్లో పరుగల్లే.. మునుపంటి బిగువల్లే.. తొనకానీ పొగరల్లే.. సొలసి సోలిన బిడ్డా నీళీ కాలువ.. జో లాలీ జో జో’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.
#JoLaaliJoJo lyrical video from #23TheMovie (#23IravaiMoodu),out now!
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 11, 2025
-- https://t.co/fLblx6bocJ
Lyrics by #IndusMartin
Sung by #AditiBhavaraju
Music by @iamMarkKRobin
A @rajrfilms Film 🎬 pic.twitter.com/BXicXNDRnu






