Mother's Day Special: మదర్స్ డే స్పెషల్.. ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాట

by Chukka Sudharani |

శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్రై డే’ (Fry Day).

Mothers Day Special: మదర్స్ డే స్పెషల్.. ‘ఫ్రై డే’ మూవీ నుంచి ‘అమ్మ’ పాట
X

దిశ, సినిమా: శ్రీ గణేష్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్రై డే’ (Fry Day). డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బాబు ధూళిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు.. మూవీపై అంచనాల్ని పెంచేసాయి. ఇందులో భాగంగానే తాజాగా మదర్స్ డే స్పెషల్‌గా అమ్మ ప్రేమను చాటే పాటను రిలీజ్ చేశారు. అమ్మ అంటూ సాగే ఈ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం నాడు రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటను చూసి చిత్రయూనిట్‌ను అభినందించారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని ప్రశంసించారు. చిత్రయూనిట్‌కు ఆమె ఆల్ ది బెస్ట్ తెలిపారు.

Next Story