- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohanlal: మోహన్ లాల్ ‘వృషభ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్
‘వృషభ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.

దిశ, సినిమా: ‘వృషభ’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుండగా.. అక్టోబర్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు మోహన్ లాల్.
‘భూమి కంపిస్తుంది.. ఆకాశం మండుతుంది.. విధి చిరునవ్వే దాని యోధుడు.. వృషభ నవంబర్ 6న రాబోతున్నది’ అని తెలిపారు. భారీ బడ్జెట్‌తో షోభా కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సైరభ్ మిశ్రా, అభిషేక్, విశాల్ గుర్నాని, ఎక్తా ఆర్. కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో సమర్జిత్ లంకేష్, షానయా కపూర్, జహ్రా ఎస్, ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది కీలక పాత్రలో కనిపించనున్నారు. లింక్






