Thudarum: తెలుగులో మోహన్ లాల్ ‘తుడరుమ్’.. రిలీజ్ ఎప్పుడంటే?

by Chukka Sudharani |

మలయాళ (Malayalam) స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘తుడరుమ్’ (Thudarum) ఒకటి.

Thudarum: తెలుగులో మోహన్ లాల్ ‘తుడరుమ్’.. రిలీజ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: మలయాళ (Malayalam) స్టార్ మోహన్ లాల్ (Mohanlal) నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘తుడరుమ్’ (Thudarum) ఒకటి. తరుణ్ మూర్తి (Tarun Murthy) దర్శకత్వం వహిస్తు్న్న ఈ సినిమాలో శోభన (Shobhana) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో మోహన్ లాల్ టాక్సీ డ్రైవర్ (Taxi driver) పాత్రలో కనిపించనున్నాడు. దీనిని భారీ బడ్జెట్‌తో ఎమ్. రంజిత్ (M. Ranjith) నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయిందని తెలుస్తుండగా.. జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది. అయితే.. మరోసారి ‘తుడరుమ్’ మూవీ వాయిదా పడినట్లు వార్తలు వస్తుండగా.. దీనిని ఖండిస్తూ ఇటీవల మోహన్ లాల్ ఓ ట్వీట్ పెట్టారు.

అనుకున్న టైమ్‌కే ఈ మూవీ మీ ముందుకు రాబోతుందని చెప్పారు. తాజాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్‌గా థియేటర్‌లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. అలాగే.. తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా త్వరలో ఈ సినిమా రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ.. ఆంధ్ర, తెలంగాణ (Andhra, Telangana)లో ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ తెలుగు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Next Story