మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం.. ఆర్మీ చీఫ్ చేతులమీదుగా అవార్డు

by Naga Rani Yarlagadda |

ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది.

మోహన్‌లాల్‌కు మరో అరుదైన గౌరవం.. ఆర్మీ చీఫ్ చేతులమీదుగా అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చేతులమీదుగా "సీఓఏఎస్ కమెండేషన్" అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన.. అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా ఉన్నారు. టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్ సామర్థ్యాన్ని పెంచడంపై అర్థవంతమైన సంభాషణకు అవకాశాన్ని కల్పించిందని పేర్కొంటూ.. తనకు ఇచ్చిన గుర్తింపునకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్మీ చీఫ్ నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా గౌరవంగా ఉందన్నారు. టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లో మరింత సామర్థ్యాన్ని ఎలా బయటకు తీసుకురావాలి, దేశం కోసం ఇంకా ఏం చేయగలమన్న దానిపై ఆర్మీ చీఫ్ తో చర్చించినట్లు మోహన్ లాల్ తెలిపారు. 2009లో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా అధికారికంగా నియమితులైనప్పుడు, టెరిటోరియల్ ఆర్మీతో మోహన్‌లాల్ అనుబంధం ప్రారంభమైంది. సినిమాల్లో ఆయన పోషించిన విశిష్ట పాత్రలకు, మలయాళ సినిమాలో దేశభక్తి విలువలను ప్రోత్సహించినందుకు గుర్తింపుగా, భారత సైన్యం నుండి ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ నటుడిగా నిలిచారు. కాగా.. ఇటీవలే ఆయన చిత్రపరిశ్రమకు అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాస్కే అవార్డు వరించిన విషయం తెలిసిందే.

Next Story