- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohanlal: వినని కథను వినేందుకు సిద్ధమా.. బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుందంటూ స్టార్ హీరో పోస్ట్
బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వృషభ’.

దిశ, సినిమా: బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వృషభ’. నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. అక్టోబర్ 16న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడి.. నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చాడు మోహన్ లాల్. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా.. ‘కొన్ని కథలు చెప్పడానికే ఉంటాయి.. మరికొన్ని గర్జించడానికి ఉద్దేశించబడ్డాయి.
ఎప్పుడు వినని ‘వృషభ’ కథను వినేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.. అక్టోబర్ 25న బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నది’ అంటూ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశాడు. ఇందులో మోహన్ లాల్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాగా.. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో షోభా కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సైరభ్ మిశ్రా, అభిషేక్, విశాల్ గుర్నాని, ఎక్తా ఆర్. కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో సమర్జిత్ లంకేష్, షానయా కపూర్, జహ్రా ఎస్, ఖాన్, శ్రీకాంత్, రాగిణి ద్వివేది కీలక పాత్రలో కనిపించనున్నారు. లింక్
- Tags
- Mohanlal






