అరడజన్ పిల్లలను కని హ్యాపీగా ఉండు బావా.. ప్రభాస్‌‌‌‌పై మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Ajay Maddhiboyina |

రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టిన రోజును జరుపుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా పోస్టుల ద్వారా పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సోషల్ మీడియాలో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు.

అరడజన్ పిల్లలను కని హ్యాపీగా ఉండు బావా.. ప్రభాస్‌‌‌‌పై మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ నేడు పుట్టిన రోజును జరుపుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా పోస్టుల ద్వారా పుట్టినరోజు విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైతం సోషల్ మీడియాలో ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. అయితే పోస్ట్ లో మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం విశేషం. మోహన్ బాబు పోస్టులో... "మైడియర్ డార్లింగ్ బావా..నీ జీవితం అపరిమితమైన సంతోషంతో నిండిపోవాలి. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు నువ్వు చాలా గ్రాండ్ గా జరుపుకోవాలి. వందేళ్లపాటు నువ్వు ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండాలి.

అంతేకాకుండా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని అరడజన్ మంది పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ ఈ బావ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు". అని పేర్కొన్నారు. ఇక మోహన్ బాబు ప్రభాస్ ను బావ అనడం, అరడజన్ పిల్లలను కనాలని సూచించడంతో నెట్టింట ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే మోహన్ బాబు ప్రభాస్ కలిసి విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర దాదాపు ౩౦ నిమిషాల పాటు ఉంది. దీంతో వీరిద్దరూ చాలా రోజుల పాటు షూటింగ్ లో కలిసి పాల్గొన్నట్టు తెలుస్తోంది.

Next Story