ఘట్టమనేని వర్సెస్ మంచు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అసలు ఏం జరుగుతుంది?

by Sujitha Rachapalli |

Mohan Babu As Villain In Srinivasa Mangapuram

ఘట్టమనేని వర్సెస్ మంచు.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. అసలు ఏం జరుగుతుంది?
X

దిశ, సినిమా : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. 500కు పైగా చిత్రాల్లో నటించిన లెజెండరీ యాక్టర్, నిర్మాత కూడా. విలన్‌గా సినిమాల్లోకి ఎంటరై.. ఆ తర్వాత హీరోగా సక్సెస్ ఫుల్ లాంగ్ కెరీర్‌తో దూసుకుపోయాడు. ఇండస్ట్రీలో 50ఏళ్ల కెరీర్‌ మైల్ స్టోన్‌ను చేరుకున్నాడు. అయితే ఈ మధ్యలో కొద్దిగా బ్రేక్ ఇచ్చిన ఆయన.. ఇప్పుడు మళ్లీ విలన్‌గా బిజీ అయిపోతున్నాడు. నాని - శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీలో విలన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా పరిచయవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలోనూ ప్రతినాయకుడి పాత్రతో మరోసారి ప్రేక్షకులను మురిపించబోతున్నాడు. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రేమకథలో రషా థడానీ కథానాయిక. కాగా సి.అశ్వనీదత్‌ సమర్పణలో చందమామ కథలు పతాకంపై పి. కిరణ్‌ నిర్మిస్తున్నారు.

Next Story