- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తలైవా పుట్టినరోజు.. ఇంట్రెస్టింగ్ ట్వీట్‌తో విషెస్ చెప్పిన ప్రధాని
తమిళస్టార్ హీరో రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ వేధికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరు రజినీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మోడీ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళస్టార్ హీరో రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ వేధికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తిరు రజినీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని మోడీ పేర్కొన్నారు. ఆయన నటన తరతరాలను ఆకర్షించిందని ప్రశంసించారు. విస్తృతమైన ప్రశంసలను సంపాదించిందని అన్నారు. రజినీకాంత్ రచనలు విభిన్నమైన పాత్రలను, శైలులను కలిగి ఉన్నాయని స్థిరంగా ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయని పేర్కొన్నారు.
రజినీకాంత్ చలనచిత్ర ప్రపంచంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ ఏడాది ముఖ్యమైనదని అన్నారు. ఆయన సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ నేడు 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. రజినీ తమిళ హీరో అయినప్పటికీ తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. రోబో సినిమాతో దేశవ్యాప్తంగా రజినీకాంత్ స్టార్ గా మారారు. అంతే కాకుండా 75ఏళ్ల వయసు వచ్చినా జోష్ ఏమాత్రం తగ్గకుండా తన నటనతో ఎనర్జీతో అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు.






