- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన మోదీ బయోపిక్ "మా వందే"
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ

దిశ, సినిమా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ను "మా వందే" టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ఈ రోజు "మా వందే" సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా "మా వందే సినిమాలో చూపించబోతున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. "మా వందే" చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం "మా వందే" చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది.






