Modern mythology: ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పురాణా కథలు.. పెద్ద హీరోలను దాటుకుంటూ హిట్ అందుకుంటున్న చిన్న సినిమాలు

by Chukka Sudharani |

ఒకప్పుడు భాగవతం, మహాభారతం వంటి కథలతో సీనియర్ హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు వంటి తారలు మన పురణాలపై సినిమాలు తీసేవారు.

Modern mythology: ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా పురాణా కథలు.. పెద్ద హీరోలను దాటుకుంటూ హిట్ అందుకుంటున్న చిన్న సినిమాలు
X

దిశ, సినిమా: ఒకప్పుడు భాగవతం, మహాభారతం వంటి కథలతో సీనియర్ హీరోలు ఎన్టీఆర్, కృష్ణ, అక్కినేని నాగేశ్వర రావు వంటి తారలు మన పురణాలపై సినిమాలు తీసేవారు. తర్వాత ఆ ట్రెండ్ కనుమరుగైపోయి.. లవ్, యాక్షన్ వంటి సినిమాలు తీస్తున్నారు. తర్వాత కొన్నాళ్లకు లస్ట్ స్టోరీస్, ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్ అంటూ ఎన్నో సినిమాలు ప్రజెంట్ సమాజానికి తగ్గట్టుగా వెండితెరపై ఎంట్రీ ఇస్తూనే ఉన్నాయి. కానీ.. అలాంటి సినిమాలు ఫ్యామిలీస్‌తో కలిసి పిల్లలు చూసే పరిస్థితి లేకుండా పోతుంది. అయితే.. ఇప్పుడు మోడ్రన్ పిల్లలకు ట్రెండీగా అర్థం అయ్యేలా మరోసారి మన పురాణాలను రీక్రియేట్ చేస్తూ తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటున్నారు డైరెక్టర్లు. అంతే కాకుండా.. ఆ సినిమాలకు తల్లిదండ్రులే దగ్గరుండి మరి పిల్లలను తీసుకెళ్లి చూపిస్తున్నారు. అలా ఇప్పటి మోడ్రన్ ట్రెండ్‌కు అనుగుణంగా మన పురాణాలను పిల్లలకు పరిచయం చేస్తూ సక్సెస్ అందుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

హనుమాన్: 2024లో విడుదలైన తెలుగు సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది సంక్రాంతి స్పెషల్‌గా వచ్చి తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదలై హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంది. అంతే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 256 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ కూడా ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా.. ఇప్పుడున్న లవ్ యాంగిల్‌ను టచ్ చేస్తూ.. చివరిలో డివోషన్ టచ్ ఇచ్చి సినిమాపై హైప్ పెంచేశారు. అలాగే.. ఈ సినిమాకు ఫుల్‌గా హనుమాన్ కథ ఉండేలా పార్ట్ 2 కూడా ప్లాన్ చేశారు మేకర్స్.

మహావతార్ నరసింహ: 2024 నవంబర్ 25 న వచ్చిన ఈ ‘మహావతార్ నరసింహ’ కంప్లీట్ యానిమేషన్ మూవీగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ చిత్రం.. హిందీ, తమిళం, మలయాళం భాషల్లో కూడా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రూ. 20 కోట్లతో తెరకెక్కి దాదాపు రూ. 48 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కథ: దేవతలు, రాక్షసుల లోకంలో జరిగిన ఈ కథ.. తన సోదరుడు హిరణ్యాక్షుడుని వరాహ అవతారంలో ఉన్న విష్ణువు సంహరించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని రాక్షస రాజు హిరణ్యకశిపుడు చూస్తాడు. అలాగే ఘోరమైన తపస్సు ద్వారా అపారమైన శక్తులను పొందిన హిరణ్యకశిపుడు.. ప్రజలు దేవతలను తలుచుకోకుండా తమనే ప్రార్థించాలని, తానే దేవుడునని ప్రకటించుకుంటాడు. ఇలాంటి సమయంలో హిరణ్యకశిపుడి 5 ఏళ్ల కొడుకు ప్రహ్లాదుడు ధర్మానికి ప్రతీకగా నిలుస్తూ తండ్రికి వ్యతిరేకంగా విష్నువును పూజిస్తాడు. దీంతో ప్రహ్లాదుడుని చంపాలని హిరణ్యకశిపుడు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవి ఫలించవు. ఇక ప్రహ్లాదుడి భక్తి విష్ణువును నరసింహ అవతారంగా ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించి విశ్వంలో సమతుల్యతను పునరుద్ధరిస్తాడు. ఈ కథ ధైర్యం, స్థిరత్వం, ఇంకా మంచికి-చెడుకి మధ్య నిరంతరం జరిగే యుద్ధాన్ని ఉత్కంఠభరితంగా వివరిస్తుంది. కాగా.. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మహావతార్ ప్రాంచైజీలో.. మహావతార్ నరసింహ (2025), మహావతార్ పరశురామ్ (2027), మహావతార్ రఘునందన్ (2029), మహావతార్ ధావకధేష్ (2031), మహావతార్ గోకులానంద (2033), మహావతార్ కల్కి పార్ట్ 1 (2035), మహావతార్ కల్కి పార్ట్ 2 (2037) రాబోతున్నాయి.

మిరాయ్: తేజా సజ్జా, శ్రీయా సరన్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిరాయ్. అశోకుడు చేసిన కళింగ యుద్దం నాటి పాయింట్‌ను ఎంచుకొని సోషల్ ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా తెరకెక్కించాడు. కథ: కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి విజయం సాధించిన తర్వాత తనలోని శక్తులను 9 గ్రంథాలుగా మార్చాడు. ఆ తొమ్మిది గ్రంథాలను చేజిక్కించుకొన్న వ్యక్తికి అమరత్వం లభిస్తుంది. అలాంటి అపూర్వమైన గ్రంథాలకు ప్రపంచాన్ని శాసించాలనే దుష్టబుద్ది కలిగిన మహావీర్ లామా కారణంగా ముప్పు ఏర్పడుతుంది. మనో నేత్రంతో ఆ ముప్పును పసిగట్టిన అంబికా దేవీ తన ఆధీనంలో ఉన్న ఎనిమిది మంది గ్రంథ పరిరక్షకులను హెచ్చరిస్తుంది. అయితే ఆ తొమ్మిదో గ్రంథాన్ని రక్షించుకొనేందుకు మిరాయ్ అనే ఆయుధం అవసరం అవుతుంది. అక్కడ నుంచే అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. అసలు అశోకుడు తనలోని శక్తలను 9 గ్రంథాలుగా ఎందుకు మార్చాడు..? తొమ్మిది గ్రంథాలను చేజిక్కుంచుకొని అమరత్వాన్ని సాధించాలనే కోరిక మహావీర్‌కు ఎందుకు కలిగింది..? అనే పాయింట్స్ సినిమాపై మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసే విధంగా ఉంటాయి. దీంతో ప్రజెంట్ ఈ మూవీ కూడా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది.

వాయుపుత్ర: యానిమేషన్ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించడానికి సిద్ధం అవుతున్న చిత్రం ‘వాయుపుత్ర’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చరిత్ర, భక్తి భావంతో భారీ స్థాయిలో 3D యానిమేషన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు. గొప్ప యోధుడు హనుమంతుడి కథతో రూపొందుతోన్న ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 దసరా కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా ‘వాయుపుత్ర’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చెయ్యగా.. ఇందులో హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తూ కనిపిస్తాడు. ఇది కూడా మన పురాణాలలో హనుమంతుడి ప్రతిభను మరోసారి కళ్లు కట్టే విధంగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమాను చూసేందుకు కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

రామాయణం: కంప్లీట్ రామాయణం ఆధారంగా బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది ‘రామాయణం’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల గ్లింప్స్ రిలీజ్ చేయగా.. యానిమేషన్స్‌లో చూపించిన రణబీర్, యష్ లుక్స్ ప్రేక్షకలును విపరీతంగా ఆకట్టుకున్నాయి. సుమారు రూ. 4000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ ఇతిహాసం చరిత్రను సృష్టించడానికి సిద్ధం అవుతున్నది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం: 2026లో.. రెండవ భాగం: 2027లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ఇలా ఇప్పుడున్న ట్రెండ్‌కు అనుగుణంగా మన పురాణాలను, చరిత్రను ప్రేక్షకులతో పాటు నేటి తరానికి అర్థం అయ్యేలా.. స్క్రీన్ ప్రజెంట్స్ చేస్తూ డైరెక్టర్స్ సక్సెస్‌ను అందుకుంటున్నారు. అంతే కాకుండా.. పెట్టిన బడ్జెట్ కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతున్నారు. దీంతో ప్రజెంట్ యువ హీరోలు సైతం మోడ్రన్ పురాణాల వైపు ఎక్కువ మక్కు చూపిస్తున్నారు.

Next Story