సాంప్రదాయ వేషధారణలో మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్

by Pulgam srinivas |

ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు

సాంప్రదాయ వేషధారణలో మెస్మరైజ్ చేసిన మృణాల్ ఠాకూర్
X

దిశ, వెబ్ డెస్క్: కెరీర్ ప్రారంభంలో సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్‌గా నటించి మరింత క్రేజ్ తెచ్చుకుంది.



ఆ చిత్రంలో తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సీత రామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, డెకాయిట్ వంటి చిత్రాల్లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించింది.




ఇప్పటివరకు అనేక సినిమాల్లో నటించిన మృణాల్ కొన్ని చిత్రాల్లో తన గ్లామర్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా తరచూ తన అందమైన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.




అందులో రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్‌లో ఉన్న చీర కట్టుకుని, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో డీసెంట్‌గా స్టిల్స్ ఇచ్చింది. మెడలో భారీ హారం, చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్, చేతులకు గాజులు, వేళ్లకు ఉంగరాలు ధరించి సంప్రదాయ సోయగాన్ని మరింతగా హైలైట్ చేసింది.




కురులు కవర్ చేసుకుని, నుదిటిపై చిన్న బొట్టు పెట్టుకుని మరింత అందంగా మెరిసింది. మొత్తానికి ట్రెడిషనల్ లుక్‌లో మృణాల్ ఠాకూర్ ఎంతో అందంగా కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story