- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా అమ్మ చాలా ఆరోగ్యంగా ఉంది.. మెగాస్టార్ చిరంజీవి ప్రకటన
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవీ(Anjana Devi) అస్వస్థతకు గురయ్యారంటూ గతకొన్ని రోజులు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవీ(Anjana Devi) అస్వస్థతకు గురయ్యారంటూ గతకొన్ని రోజులు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోందని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘మా అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలు నా దృష్టికి వచ్చాయి. రెండు రోజులుగా ఆమె కాస్త అస్వస్థతకు గురైందని.. ఆసుపత్రిలో చేరిందని అంటున్నారు. అందుకే అభిమానులు, శ్రేయాభిలాషులతో పాటు మీడియాకు ఒక విన్నపం చేయాలనుకుంటున్నాను. ఆమె చాలా ఆరోగ్యంగా, హుషారుగా ఉన్నారు. ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దు. దయచేసి అన్ని అన్ని మీడియా సంస్థలు గమనించగలరు’ అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారనే వార్తలపై చిరంజీవి టీమ్ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేసింది. కేవలం సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగానే ఆమెను గత వారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని వెల్లడించారు. అసత్య వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు.






