ఆనంద్ మహీంద్రపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

by Malleboina Mahesh |

టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఆనంద్ మహీంద్రపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ (Telangana Global Summit)లో ఆనంద్ మహీంద్రను కలిసిన చిరంజీవి, ఆయన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో ఆనంద్ మహీంద్ర వినయం, నిరాడంబరత (humility and down-to-earth nature) తనకు ఎంతో ఆకట్టుకున్నాయని, వ్యక్తిగతంగా ఆ లక్షణాలను తాను ఎంతో గౌరవిస్తానని చిరంజీవి పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆనంద్ మహీంద్ర... తన విలువలు, పనులు, నడవడికతో గొప్పతనాన్ని పెంచుకున్న రతన్ టాటాని గుర్తుచేస్తున్నారని చిరంజీవి ఆ పోస్ట్‌లో ప్రస్తావించారు.

ఆనంద్ మహీంద్ర సామాజిక సేవా కార్యక్రమాలకు (philanthropic initiatives) కట్టుబడి ఉండటం తనకు చాలా స్ఫూర్తిని ఇచ్చిందని, ఆయనతో కలిసి అలాంటి సార్థకమైన పనులలో పాల్గొనడానికి తాను మరింత ఉత్సాహంగా ఉన్నానని చిరంజీవి తెలిపారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సంభాషణల కోసం ఎదురుచూస్తున్నానని మెగాస్టార్ తన ట్వీట్ ను ముగించారు.

Next Story