అఖిల్ రిసెప్షన్‌కు హాజరైన మెగాస్టార్.. కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-01-20 12:05:01  IST  )

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), అఖిల్, నిర్మాత జార్ట్ చాచన్(George Chachan) కూతురు సింథియాల పెళ్లికి హాజరయ్యారు.

అఖిల్ రిసెప్షన్‌కు హాజరైన మెగాస్టార్.. కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్
X

దిశ, సినిమా: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), అఖిల్, నిర్మాత జార్ట్ చాచన్(George Chachan) కూతురు సింథియాల రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. అంతేకాకుండా కొత్త జంటతో ఫొటో దిగి సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మీరు కలిసి ఈ అందమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన సుందరమైన జంట సింథియా(Cynthia), అఖిల్‌(Akhil)కి అభినందనలు. మీ ఇద్దరు జీవితకాలం ప్రేమ, సంతోషంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం మమ్ముట్టి పోస్ట్ వైరల్ అవుతోంది. ఇక మమ్ముట్టి సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది రెండు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం బజూకా(Bazooka), డొమైన్ అండ్ ది లేడీస్ పర్స్(Dominic and the Lady's Purse) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో త్వరలోనే విడుదల కానున్నాయి. మమ్ముట్టి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

Next Story