- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mammooty : మెగా స్టార్ కు తీవ్ర అనారోగ్యం
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammooty) తీవ్ర అనారోగ్యానికి(Health Issue) గురైనట్టు సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి(Mammutti) తీవ్ర అనారోగ్యానికి(Health Issue) గురైనట్టు సోషల్ మీడియాలో, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతూ సినిమాలకు విరామం తీసుకున్నారనే రూమర్స్ ఆయన అభిమానులను, సన్నిహితులను ఆందోళనలో పడేశాయి. అయితే రాజ్యసభ ఎంపీ, మమ్ముట్టి సన్నిహితుడైన జాన్ బ్రిట్టాస్ ఈ వార్తలను ఖండించారు. మమ్ముట్టి కేవలం చిన్న ఆరోగ్య సమస్యతో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలో పూర్తిగా కోలుకుని సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని స్పష్టం చేశారు.
క్యాన్సర్ వంటి తీవ్రమైన అనారోగ్యమనే వార్తలు పూర్తిగా అవాస్తవమని, దయచేసి అలాంటి అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు. ఇదిలా ఉంటే దర్శకుడు మహేష్ నారాయణన్ రూపొందిస్తున్న చిత్రంలో మోహన్‌లాల్(MohanLal)తో కలిసి మమ్ముట్టి నటించనున్నారనే వార్తలు కూడా వినవస్తున్నాయి. దీనిని బట్టి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, త్వరలో కోలుకుంటారని తెలుస్తోంది.






