అతనితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పంచుకున్న మెగా డాటర్.. పోస్ట్ వైరల్

by I. Sairam |

మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అతనితో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పంచుకున్న మెగా డాటర్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక కొణిదెల(NIHARIKA KONIDELA) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. కానీ అనుకున్నంతగా విజయం సాధించలేదు. దీంతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నది. అలా ఫస్ట్‌గా తీసిన మూవీ ‘కమిటి కుర్రోళ్లు’(Comittee Kurrollu). తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. నిహారిక చైతన్య జొన్నలగడ్డ(Chaitanya Jonnalagadda) అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది. కానీ పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అలాగే నిత్యం ఫ్రెండ్స్‌తో వేకెషన్స్‌కు వెళుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియా(Social Media) వేదికగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో బ్లాక్ కుక్కతో ఎక్కడో వేకెషన్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను పంచుకుంది. ఆ కుక్కతో మట్లాడుతున్నట్లు, దాని తల పెట్టి నిమురుతున్నట్లు, దానిని ప్యాంపర్ చేస్తున్నట్లు ఉన్న పిక్స్‌ను షేర్ చేస్తూ.. ‘వీటికి క్యాప్షన్ అవసరం లేదు.. ఇద్దరు నేచురల్ లవర్స్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story