తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా "మీరేలే" సాంగ్ లాంచ్

by velandi.Saikiran |

తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా మీరేలే సాంగ్ లాంచ్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: కృష్ణా బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణీ వక్కా అలాగే రామ్ నితిన్ కీలక పాత్రల‌లో చేస్తున్న సినిమా 'జిగ్రీస్'. మౌంట్ మీరు పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుండగా హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ 'జిగ్రీస్' సినిమాకు కృష్ణ వొడపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మీరెలా సాంగ్ ను సక్సెస్ఫుల్ దర్శకుడు తరుణ్ భాస్కర్ రిలీజ్ చేశారు. ఈ పాటను సయ్యద్ కమ్రాన్ కంపోజ్ చేశారు. హరీష్ రెడ్డి ఉప్పుల‌ రాసిన లిరిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ సినిమా నవంబర్ 14వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఈశ్వరాదిత్య డీవోపి, కామ్రాన్ మ్యూజిక్, చాణక్య రెడ్డి ఎడిటర్ గా ఉన్నారు.




Next Story