Meenakshi Chowdhury: ఆకట్టుకుంటోన్న మీనాక్షీ చౌదరి లేటెస్ట్ ఫొటోస్.. వామ్మో దేవకన్యలా ఉన్నావంటున్న ఫ్యాన్స్

by Chukka Sudharani |   (  Updated:2025-06-13 16:08:25  IST  )

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి.

Meenakshi Chowdhury: ఆకట్టుకుంటోన్న మీనాక్షీ చౌదరి లేటెస్ట్ ఫొటోస్.. వామ్మో దేవకన్యలా ఉన్నావంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి. తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. ‘హిట్: ది సెకండ్ కేస్’తో ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత ‘లక్కీ భాస్కర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒకారాజు’ సినిమాతో పాటు పలు ప్రాజెక్టులు లైన్‌లో పెట్టింది మీనాక్షి. అటూ సినిమాలతో పాటు ఇటూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోనే మీనాక్షి లేటెస్ట్‌గా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతుండగా.. వామ్మో ఇంత అందంగా ఉన్నావు ఏంటీ అని దివినుంచి దిగి వచ్చిన దేవకన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Next Story