బీజేపీలో చేరనున్న టాలీవుడ్ హీరోయిన్?

by velandi.Saikiran |

టాలీవుడ్ సీనియర్ వెటరన్ హీరోయిన్ మీనా ( Meena) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోయిన్ మీనా

బీజేపీలో చేరనున్న టాలీవుడ్  హీరోయిన్?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ వెటరన్ హీరోయిన్ మీనా ( Meena) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హీరోయిన్ మీనా టాలీవుడ్ ఇండస్ట్రీలో... ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చాలా సినిమాలలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు. అలాంటి హీరోయిన్ మీనా... ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ సెకండ్ ఇన్నింగ్స్ సినిమాల్లో కాకుండా... రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

అతి త్వరలోనే హీరోయిన్ మీనా రాజకీయాల్లోకి రాబోతున్నట్లు నేషనల్ అలాగే తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ ను (Jagdeep Dhankhar) హీరోయిన్ మీనా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె త్వరలోనే భారతీయ జనతా పార్టీలో ( BJP) చేరబోతున్నారని... ప్రచారం కూడా జోరు అందుకుంది.

వచ్చే సంవత్సరంలోనే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... తమిళనాడులో ( Tamilnadu) ఉన్న సినీ గ్లామర్ ను తమ వైపు తిప్పుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. మొదటి నుంచి కూడా సినీ సెలబ్రిటీలను ఆకర్షించి తమ పార్టీ వైపు తిప్పుకుంటుంది బిజెపి అధిష్టానం. ఇందులో భాగంగానే ఇప్పుడు మీనాను... పార్టీలో చేర్చుకొని టికెట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతా ఓకే అయితే వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో మీనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని కూడా ప్రచారం జోరు అందుకుంది. మరి దీనిపై హీరోయిన్ మీనా ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story