- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తూ మేర లవర్’ సాంగ్‌లో మాస్ బీట్.. ప్రోమోతోనే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (SreeLeela)మరోసారి జతకట్టబోతున్నారు.

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (SreeLeela)మరోసారి జతకట్టబోతున్నారు. మొదటిసారి ‘ధమకా’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన వీరిద్దరు కాంబో రిపీట్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’. ఇందులో రవితేజ, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), శ్రీకర స్టూడియోస్, ఫర్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ Naga Vamsi)నిర్మించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిలో హైప్ పెంచాయి. తాజాగా, హనుమాన్ జయంతి సందర్భంగా మూవీ మేకర్స్ మాస్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్ ఏప్రిల్ 14న రాబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రోమోలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇడియట్‌లోని సాంగ్ చూపుల్తో గుచ్చి గుచ్చి సంపకే బీట్ యాడ్ చేయగా.. శ్రీలీల కన్ను కొడుతూ వస్తున్నట్లుగా చూపించారు. అంతేకాకుండా స్టెప్స్ కూడా అవి పెట్టిన వీడియోను నెట్టింట పెట్టారు. ఈ మాస్ బీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
#TuMeraLover Promo is out now 💥
— BA Raju's Team (@baraju_SuperHit) April 12, 2025
Full song on April 14th 🎧
A #BheemsCeciroleo Musical 🥁#MassJathara @RaviTeja_offl
pic.twitter.com/hHUipot6a3






