రవితేజ కొడుకు సినిమా పూర్తి.. లుక్ అదిరింది..

by Sujitha Rachapalli |

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌కు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మో

రవితేజ కొడుకు సినిమా పూర్తి.. లుక్ అదిరింది..
X

దిశ, సినిమా : మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ 'మారెమ్మ'తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌కు మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో మాధవ్ ఎద్దును నడిపిస్తూ ధైర్యంగా ముందుకు వస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. బ్యాక్ డ్రాప్‌లో శక్తివంతంగా కనిపించే కాళీదేవి విగ్రహం, చుట్టూ గ్రామీణ పండుగ వాతావరణం, జన సందడి, ఉత్సవ ఉత్సాహంతో పాటు ఒక పవర్ ఫుల్ సంఘటనకు సంకేతంగా కనిపిస్తోంది. కాగా ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తోంది. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్ కాగా రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్.


Next Story