- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి మృతి !
ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మరాఠీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆమె 68ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె.. ఆగస్టు 16న సాయంత్రం

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటి జ్యోతి చందేకర్ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మరాఠీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఆమె 68ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా పూణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆమె.. ఆగస్టు 16న సాయంత్రం నాలుగు గంటల సమయంలో మరణించారని ధృవీకరించారు వైద్యులు. మరాఠీ ఇండస్ట్రీ, టెలివిజన్ రంగం, రంగస్థలంలో ఆమె చేసిన సేవలకు ఎన్నో అవార్డులు అందుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను పోషించి.. ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించారు. కాగా ఆమె మరణవార్త విన్న ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
‘ధోల్కీ, ‘తిచా ఉంబర్తా’. ‘మీ సింధుతాయ్ సప్కాల్’ వంటి చిత్రాలు.. ‘ఛత్రీవాలీ’, ‘తూ సౌభాగ్యవతి హో’ వంటి సీరియల్స్ ద్వారా ఆడియన్స్‌ను మెప్పించిన జ్యోతి చందేకర్.. ప్రసిద్ధ నటి తేజస్విని పండిట్‌కు తల్లి. కాగా వీరిద్దరు కలిసి నటించిన ‘తిచా ఉంబర్తా’ సినిమాలో వారి నటనకు జీ గౌరవ్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇండస్ట్రీకి చేసిన సేవలకు బాలగంధర్వ జీవతత సాఫల్య పురుస్కారం కూడా లభించింది.






