- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mangalavaram-2: ‘మంగళవారం-2’లో హీరోయిన్‌గా అల్లు అర్జున్ బ్యూటీ ఫిక్స్.. ట్వీట్ వైరల్
గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మంగళవారం’(Mangalavaram).

దిశ, సినిమా: గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మంగళవారం’(Mangalavaram). 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో నందిత శ్వేతా, దివ్య పిళ్లై, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ‘మంగళవారం 2’కు మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అజయ్ భూపతి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ని పూర్తి చేశారట. త్వరలోనే మూవీ షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ఉన్న బజ్ దృష్ట్యా ఓ బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ నిర్మాణంలో భాగం కాబోతోందని తెలుస్తోంది.
ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఆయన సంగీతంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజపుత్ కూడా హైలెట్ అయింది. కానీ ఆమె అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ‘మంగళవారం 2’ (Mangalavaram 2) లో హీరోయిన్ ఆమె కాదు. మేకర్స్ ప్రస్తుతానికి ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఈ చిత్రం కోసం సంప్రదింపులు జరుపుతున్నారట. త్వరలోనే హీరోయిన్ విషయంపై అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం ‘మంగళవారం-2’ సినిమాలో లీడ్ రోల్‌లో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా యంగ్ బ్యూటీ శ్రీ లీల ప్రస్తుతం నితిన్(Nithin) సరసన ‘రాబిన్ హుడ్’(Robbin Hood), శివ కార్తికేయన్(sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘వీడీ-12’(VD-12), రవితేజ(Raviteja) సరసన ‘మాస్‌కా జాతర’(MassKa Jathara) వంటి సినిమాలతో పాటు బాలీవుడ్‌లో స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan)తో ఓ రొమాంటిక్ హారర్ కామెడీ మూవీలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉంది.






